ఏపీలో కొత్తగా 8,987 కరోనా కేసులు..

 గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 37,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  35 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 3,116 మంది క్షేమంగా కొలుకున్నారు.  ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా..  9 లక్షల 15వేల 626 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు.