తన పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అన్నారు. సంతోష్‌కుమార్‌ ఇచ్చిన పిలుపు మేరకు తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటానని ఎమ్మెల్యే తెలిపారు.

కరోనా వైరస్ ప్రభావం వల్ల పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యకర్తలను కూడా ఎవరిని కలువడంల ఏదని పేర్కొన్నారు. అలాగే నాగర్ కర్నూల్ నియోజకవర్గం ప్రజలందరూ కుడా మొక్కలు నాటి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు.