బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్‌ నేత జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నడ్డా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ఎన్నికల ఇంచార్జి రాధా మోహన్‌సింగ్‌ ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నడ్డాకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధుల్ని నిర్వహిస్తున్నారు.