తెలంగాణ‌లో కొత్తగా 8,061 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ‌ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిన్న ప‌దివేల‌కు పైగా న‌మోదైన క‌రోనా కేసులు.. నేడు 8 వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే రాష్ట్రవ్యాప్తంగా 8,061 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. తాజాగా మ‌రో 56 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. 5,093 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరింది. ప్ర‌స్తుతం 72,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్క‌రోజే రాష్ర్ట వ్యాప్తంగా 82,270 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 8 వేల మందికి పైగా క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,508 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డిలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 328 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.