గురుకుల జూనియ‌ర్ క‌ళాశాల‌ల ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

గురుకుల జూనియ‌ర్ కళాశాల‌ల ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తు గ‌డువును ప్ర‌భుత్వం పొడిగించింది. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశానికి విద్యార్థులు మే 17 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

విద్యార్థులు tsrjdc.cgg.govt.in వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వ‌నియోగం చేసుకోవాల‌ని కోరింది.