స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు 2418 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
అర్హులు లేక 893 పోస్టులు భర్తీ చేయలేదని వెల్లడించింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి త్వరలో నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపింది.