నకిరేకల్‌ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన రాచకొండ శ్రీను

నూతన పాలక వర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ మెరుగైన పాలన అందించాలని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రాచకొండ శ్రీను, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణిలకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కెప్టెన్‌ లక్ష్మీ కాంతా రావు, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యా సాగర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి మంత్రి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

కొత్తగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని చిత్తశుద్దితో నిర్వర్తిస్తామని వారు తెలిపారు. సీఎం కేసీఆర్‌ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో నకిరేకల్‌ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.