గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్యే తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఖేడ్‌లోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.