ఏ వార్డులో ఎవరు గెలుస్తారు టెన్షన్.. టెన్షన్..

మన వార్డులో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? మున్సిపాలిటీ చైర్మన పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? పురపాలక సంఘాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే జిల్లా అంతటా వినిపిస్తున్న సాధారణ ప్రశ్నలు ఇవి. ఎన్నికలు జరుగుతున్న నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూర్ పట్టణాలతోపాటు జిల్లా అంతటా పురపోరు పై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? ఎంత మెజారిటీ సాధించే అవకాశం ఉంది? ఇలాంటి అంచనాలు ఓటర్లలో నెలకొన్నాయి. తమదైన శైలిలో ప్రతి ఒక్కరూ తమ తమ విశ్లేషణలు తోటి వారికి వినిపిస్తున్నారు.