ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా జర్నలిస్టులు : డీహెచ్‌ శ్రీనివాసరావు

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. ఎల్లుండి నుంచి జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచారశాఖ ద్వారా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను 1200కు పెంచినట్లు తెలిపారు.