ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో రాష్ట్రాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. నాటి ఉద్యమ నినాదాలను స్వరాష్ట్రంలో ఒక్కోటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ‘అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంత వరకు విశ్రమించను’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.