సందట్లో సడేమియా.. అదునుచూసి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు

  • లాక్ డౌన్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కెమికల్ పరిశ్రమలు
  • కరోనా భయంతో పిసిబి నిఘా బృందాలు బంద్
  • ఇదే అదునుగా రెచ్చిపోతున్న కెమికల్ పరిశ్రమలు
  • ఇష్టానుసారంగా పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు
  • జీడిమెట్ల పారిశ్రామిక వాడలో రసాయన వ్యర్థాలను నాలాలో పారబోస్తున్న పలు పరిశ్రమలు

కరోనా కష్టకాలం ప్రజలందరినీ ఇబ్బందిపెడుతుంటే.. కాలుష్య కారక పరిశ్రమలు మాత్రం ఇదే అదునుగా భావించి సందట్లో సడేమియాలాగా తమ ఇష్టానుసారంగా పొల్యూషన్ చేస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టాయి. లాక్ డౌన్ పెట్టడంతో కాలుష్య కారక పరిశ్రమలు రెచ్చిపోయి కాలుష్యం విడుదల చేస్తున్నాయి. పొల్యూషన్ పై నిఘాపెట్టడానికి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పిసిబి) ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా బృందాలు కరోనా ప్రభావంతో పొల్యూషన్ పరిశ్రమల వైపు చూడటమే బంద్ చేశాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కాలుష్య కారక పరిశ్రమల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. కెమికల్ పరిశ్రమలు విపరీతమైన వాయు, జల, భూ కాలుష్యం చేస్తున్నాయి.

ముఖ్యంగా చౌటుప్పల్, సంగారెడ్డి, పటాన్ చెరువు, జీడిమెట్ల, ఉప్పల్, ఐడీఏ బొల్లారం, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, కూకట్ పల్లి, నాగోలు, పాశమైలారం, మఠంపల్లి, మేళ్లచెరువు జోగులాంబ గద్వాల లాంటి ప్రాంతాలలో వందల సంఖ్యలో ఫార్మ కంపెనీలు మరియు సిమెంట్ పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లులు మొదలగు పొల్యూషన్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో ఈ ప్రాంతాల్లో గాలి, నీరు, భూమి పూర్తిగా పొల్యూషన్ అయ్యాయి. ఈ ప్రాంతాల్లో బోర్లు వేస్తే పచ్చ, ఎరుపు రంగులో కలుషిత జలాలు వస్తుంటాయి. ఇవే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా పొల్యూషన్ పరిశ్రమలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పరిశ్రమలు మామూలు రోజుల్లోనే ఏమాత్రం భయం లేకుండా విపరితమైన పొల్యూషన్ చేస్తుంటాయి. ఇప్పుడు కొవిడ్ సమయం పైగా ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడంతో పిసిబి అధికారుల నిఘా లేకపోవడంతో ముఖ్యంగా కెమికల్ పరిశ్రమల యాజమాన్యాలు విచ్ఛలవిడి పొల్యూషన్ చేస్తూ రెచ్చిపోతున్నాయి. ఈ పొల్యూషన్ తో స్థానిక ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు అని పర్యావరణవేత్తలు అంటున్నారు. పొల్యూషన్ తగ్గించేందుకు పిసిబి అధికారులు నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నప్పుడు కూడా కాలుష్య కారక పరిశ్రమలు పొల్యూషన్ చేస్తూ ఉండేవి.. కానీ ఇప్పుడు లాక్ డౌన్ పెట్టడంతో పిసిబి అధికారుల నిఘా కూడా లేకపోవడంతో ఈ కాలుష్య కారక పరిశ్రమలు చేసే విచ్చలవిడి కాలుష్యానికి అడ్డుఅదుపులేకుండా పోతుంది అని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పొల్యూషన్ పరిశ్రమలపై పిసిబి అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పిసిబి) ఆధ్వర్యంలో హైదరాబాద్ జోనల్ కార్యాలయం, రాంచంద్రాపురం జోనల్ కార్యాలయం కలిపి మొత్తం 3 ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాయి. ఈ టీంలోని సభ్యులు ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో తిరుగుతూ పర్యవేక్షిస్తుంటారు. కరోనా ప్రభావం లేని రోజుల్లో పొల్యూషన్ చేసే పరిశ్రమలకు ఈ నిఘా టీంల భయంతో కొంత హద్దుల్లో ఉండేవారు. అయినప్పటికి ఈ నిఘా టీంల కళ్లుగప్పి అర్థరాత్రిళ్లు నాలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, నేషనల్ హైవేల ప్రక్కన వ్యర్థాలు వదిలేవి. అలా చేస్తున్నప్పుడు పిసిబి అధికారులు కూడా చాలా మందిని పట్టుకున్నారు. అలా దొరికిన పరిశ్రమలపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉండడం మరియు కరోనా వైరస్ భయంతో పిసిబి నిఘా బృందాలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఇదే అదునుగా భావించిన కెమికల్ కంపెనీలు రాత్రి అయ్యిందంటే చాలు తీవ్రమైన కాలుష్య వాయువులను వదులుతున్నాయి ఆ వాసన భరించలేకపోతున్నాం అని స్థానికులు వాపోతున్నారు. ఇక అర్థరాత్రి టైంలో కెమికల్ పరిశ్రమల వారు ట్యాంకర్లతో రసాయన వ్యర్థాలు తెచ్చి పారబోస్తున్నాయి. అంతేకాక కెమికల్ పరిశ్రమలు నాలాలలో వదిలే రసాయనలతో ఇళ్ల మధ్యల నుంచి వెళ్లే నాలాల నుంచి భరించలేని కంపు వస్తోందని స్తానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ చేస్తున్న కెమికల్ మరియు ఇతర పరిశ్రమలపై పిసిబి అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిశ్రమలు ఇలాగే పొల్యూషన్ చేస్తే కరోనా లాంటి రోగాలు రావడమే కాదు ఇంక అనేక రకలైన వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడకతప్పదేమో.. ఇప్పటికైన పిసిబి అధికారులు పొల్యూషన్ పరిశ్రమలపై నిఘా పెంచి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలను కంట్రోల్ చేస్తారని ఆశిద్దాం…