గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటిన మంత్రి హ‌రీశ్‌రావు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించిన‌ రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు శుక్ర‌వారం మొక్క‌లు నాటారు. గురువారం హ‌రీశ్‌రావు జ‌న్మ‌దిన వేడుక‌ను పుర‌స్క‌రించుకుని మొక్క‌లు నాటాల్సిందిగా ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సిద్దిపేట‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ బిజినెస్ ఆఫీస్ ప్రారంభం అనంత‌రం ప్రాంగ‌ణంలో మొక్క నాటారు. ఈ అద్భుత కార్య‌క్ర‌మంతో ముందుకు వ‌చ్చిన ఎంపీ సంతోష్ కుమార్‌ను మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు.