చిన్నారులు మేము సైతం గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తాం .. మా భవిష్యత్ కి మేమే పచ్చని ప్రకృతి బాట వేస్తాం అంటూ కేంబ్రిడ్జ్ గ్రామర్ హై స్కూల్, మణుగూరు, కొత్తగూడెం జిల్లాలో నూతన ఒరవడిని ప్రారంభించారు.. స్కూల్ లో మొక్కలు నాతడమే కాదు , అక్కడ గ్రామాల్లో నాటిన మొక్కలకు నీరు పోసి , వాటి ఎదిగే వరకు కాపాడాలి అని ఆ చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు కేంబ్రిడ్జ్ పాఠశాల 30 మంది విద్యార్థులు , డైరెక్టర్ సనల్ గారి ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు . వారితో టిఆర్ఎస్వీ విభాగ నాయకులు పాల్గొని , కార్యమానాకి సహకరించారు , వీరితో పాటు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతరావు గారి ఫొటోతో ఒక పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సనల్ మాట్లాడుతూ ఇది ఆరభం మాత్రమే , గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక 100 మొక్కలు 100 మంది విద్యార్థులు చేత నాటించి, వాటికి నీరు పొసే విదంగా విద్యార్థులకు అలవాటు చేసి ఎదిగే వరకు బాధ్యత తీసుకుంటాం అని తెలియజేశారు. ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ గారు తను ఎంచుకన్న మార్గం చాలా ఉపయోగకరమైనది గా , భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యకర వాతావరణం అందిస్తున్నారని , ఇలానే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, తను అనుకున్న లక్ష్యం చేరుకొని, వనజీవి సంతోష్ గా పేరు ప్రఖ్యాతులు గడించాలని కోరారు .