ఏపీలో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్‌-19తో 57 మంది చనిపోయారు. 8,486 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 18,39,243కి చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 67,629గా ఉంది.

జిల్లాల వారీగా కొవిడ్‌-19 మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో 12 మంది, గుంటూరులో 8 మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, కర్నూలు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు.