తెలంగాణ‌లో కొత్త‌గా 1,417 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా 1,417 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 12 మంది మ‌ర‌ణించిన‌ట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ 1,897 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 19,029 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 1,24,430 మందికి కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కొత్త‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 149, రంగారెడ్డిలో 104, ఖ‌మ్మంలో 93, న‌ల్ల‌గొండ‌లో 88, క‌రీంన‌గ‌ర్‌లో 87, సూర్యాపేట‌లో 85 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.