
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట సర్వేయర్ మొబిన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. భూమిని కొలించేందుకు తహసీల్దార్ ఆఫీస్‌లో బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. తాను భూమి సర్వే చేయడానికి రావాలంటే రూ.10వేలు లంచం ఇవ్వాలని మొబిన్ డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు ఈ రోజు తహసీల్దార్ ఆఫీసు పక్కన హోటల్ వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారుల విజ్ఞప్తి చేశారు.