ఇవాళ మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌ర స‌మావేశం

ఇవాళ మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానుంది. రేప‌టితో లాక్‌డౌన్ ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌పై కేబినెట్ త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనుంది. దీంతో పాటు సీజ‌న‌ల్ వ్యాధులు, త‌దిత‌ర అంశాల‌పై మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. వ‌ర్ష‌పాతం, వానాకాలం సాగు, సాగు సంబంధిత అంశాలు, గోదావ‌రిలో నీటి ఎత్తిపోత‌, జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తిపై కూడా చ‌ర్చించ‌నున్నారు.