ఏపీలో కొత్తగా 5,674 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,674 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్‌-19తో 45 మంది మరణించారు. 8,014 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య 18,44,917కి చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,244గా ఉంది.

జిల్లాల వారీగా నమోదైన కరోనా మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో 9 మంది, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణాలో ఐదుగురు చొప్పున, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ముగ్గురు చొప్పున, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరంలో ఇద్దరు చొప్పున, నెల్లూరులో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు.