రేపటి నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరణ

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరించి టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి బస్సు సర్వీసులు నడపనుంది. అదేవిధంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకకు సర్వీసులను నడపనుంది.

ఏపీఎస్‌ఆర్టీసీ సైతం రేపట్నుంచి తెలంగాణ రాష్ర్టానికి బస్సులు నడపాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపాలని నిర్ణయం. విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ర్టానికి బస్సు సర్వీసులు నడవనున్నాయి.