ఏపీలో కొత్తగా 2,620 కరోనా పాజిటివ్‌ కేసులు, 44 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 55,002 శాంపిల్స్‌ పరీక్షించగా కొత్తగా 2,620 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1853183కు చేరింది. ప్రస్తుతం 58140 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు వైరస్‌ నుంచి 1782680 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12363కు పెరిగింది.