గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌

గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతోపాటు పలువురు అధికారులుహాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయాలని తెలిపారు. కల్తీ విత్తనాల విక్రయంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉండాలని తెలిపారు.