మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీ రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వనపర్తి జిల్లాకు హరితహారానికి సంబంధించిన మొక్కలను తరలించారు. అందుకు సంబంధించిన బిల్లులను చేయమని అటవీశాఖ అధికారి బాబ్జీ రావును అడగగా రూ. 4 లక్షల 25 వేల లంచాన్ని డిమాండ్ చేశాడు.
దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు మూడు లక్షల రూపాయలను ఈ రోజు సాయంత్రం బాబ్జీరావుకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.