అన‌కాప‌ల్లిలో కుప్ప‌కూలిన ఫ్లైఓవ‌ర్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం, ప‌లువురికి గాయాలు

 అన‌కాప‌ల్లిలో ఓ ఫ్లైఓవ‌ర్ కుప్ప‌కూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్ సైడ్‌ బీములు కింద‌ప‌డ‌టంతో ఒక కారు, ట్యాంక‌ర్ నుజ్జునుజ్జ‌యింది. ఈ ప్ర‌మాదంలో కారు సీట్ల కింద న‌లిగిపోయి ఒక బాలుడు, యువ‌కుడు దుర్మ‌ర‌ణం చెందారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.