ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తాం: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అందర్నీ భాగస్వాములను చేసి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ వారికి ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం వివరాలతో కూడిన పోస్టర్లను అందజేశారు.

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చాలా గొప్పదని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. దీనిలో క్రీడాకారులందరిని భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు.
గోపీచంద్‌కు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో కూడిన పోస్టర్‌ను ఎంపీ అందజేశారు.