తెలంగాణకు మణిహారం హరితహారమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేసీఆర్ అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రానికి మణిహారం అని కొనియాడారు. ఆకుపచ్చని తెలంగాణకై సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని తెలిపారు. ప్రతి అంగుళం భూమి మొక్కలతో నిండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎఫ్వో రవి కిరణ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.LikeCommentShare