‘గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్‌ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన మహిళా సమాఖ్యకు చెందిన మహిళలు 10 రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేశారు. వాటిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లోని మైదాన ప్రాంతాల్లో వెద జల్లే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిలుగా పాల్గొని విజయవంతం చేశారు.

ఈ రికార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం ఇస్తునట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కృషి చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.