పర్యావరణ కాలుష్యంపై వివాదాల పరిష్కారానికి పీసీబీ అప్పీలేట్ అథారిటీని రెండు వారాల్లో నియమించి గెజిట్ నోటిఫికేషన్‌ను కోర్టు ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. పీసీబీ అప్పీలేట్ అథారిటీ లేకపోవడం వల్లే కేసులు హైకోర్టుకు వస్తున్న దృష్ట్యా అప్పీలేట్ అథారిటీ నియమించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా పీసీబీ అప్పీలేట్ అథారిటీని నియమించని పక్షంలో అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.