మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని 5వ డివిజన్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, మేయర్‌ వై.సునీల్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని తీసుకొని కోట్లాది మొక్కలు నాటిస్తున్నారని తెలిపారు.

హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. కరీంనగర్‌ను హరిత నగరంగా మార్చాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో వేగంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌ షమీ, ముస్లిం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.