ముక్కోటి వృక్షార్చన పోస్టర్‌ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జూలై 24 న మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలోని తన కార్యాలయంలో ముక్కోటి వృక్షార్చన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ..ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా చేయాలని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్ణయించారన్నారు. కార్యక్రమంలో దోనేపూడి రమేష్ బాబు, సుందర్ రాజ్, పొడిశెట్టి అనిల్, తాళ్లపల్లి జనార్దన్, లక్ష్మణ్, ప్రకాష్, రోహిత్ సింగ్, వేణు మాధవ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.