ఏసీబీ వలలో మిర్యాలగూడ ఏవో బొలిశెట్టి శ్రీనివాస్‌

రైతు బీమా డబ్బులు క్లైమ్ చేసుకునేందుకు గాను లంచం డిమాండ్‌ మిర్యాలగూడ వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు అన్వేష్ రెడ్డి మృతి చెందాడు. కాగా, రైతు బీమా డబ్బులు క్లైమ్ చేసుకునేందుకు అతడి బంధువు శ్రీనివాస్ రెడ్డి ఏవో శ్రీనివాస్‌ను ఆశ్రయించాడు. ఫైల్ మూవ్ చేసేందుకు పదిహేను వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని రూ. 12,000 ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచినల మేరకు పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాప్ లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.