ముక్కోటి వృక్షార్చనలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ జన్మదినం సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చణ’ కార్యక్రమంలో భాగంగా ల‌క్ష్మణ‌చాంద ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. మ‌హిళ‌ల‌కు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగ‌స్వాములు కావాల‌ని, ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటిని సంర‌క్షించాల‌ని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆశ‌యాల‌కు అనుగుణంగా ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, హ‌రిత తెలంగాణ కోసం త‌న‌ వంతు కృషి చేస్తున్నార‌ని మంత్రి అభినందించారు.