కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ నిన్న జీవో ఇచ్చినట్టు ఏజీ తెలిపారు. 2,3 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని ఏజీ పేర్కొన్నారు. పీసీబీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలుంటే అప్పీలెట్ అథారిటీకి వెళ్లాలని హైకోర్టు పేర్కొంది.