తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీని ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ.ప్రకాశ్ రావు, సభ్యులుగా ఉస్మానియ వర్సిటీ మాజీ ఆచార్యులు వీ.ప్రభాకర్ రెడ్డి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ శాస్త్రవేత్త జయతీర్థరావు నియమితులయ్యారు.