
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్‌లో గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులతోపాటు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు, భక్తుజనంతో నాగోబా ఆలయం కిక్కిరిసిపోయింది. మెస్రం వంశీయులు కెస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. పురాతన ఆలయంలో ఉంచిన నాగోబా విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తరలించారు.కెస్లాపూర్ నుంచి నాగోబా విగ్రహాన్ని తీసుకొస్తున్న మెస్రం వంశీయులను మర్రిచెట్ల వద్ద బసచేసిన మెస్రం వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు.