కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్‌ పరిధి మైలార్ దేవుపల్లి డివిజన్‌లోని కాటేడాన్ పారిశ్రామికవాడలో ఈ తెల్లవారుజామున భారీగా అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్‌ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి క్షణాల్లో వ్యాపించాయి. పక్కనే ప్లాస్టిక్‌ గోదాముకు మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎంతమేర ఆస్తినష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.