క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా, పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో కోదండ రెడ్డి మాట్లాడుతూ.. నూతన టిపీసీసీ అధ్యక్షుని నియామకం సందర్భంగా కొత్త కమిటీ ఏర్పాటుకు వెసులుబాటుగా రాజీనామా చేశానన్నారు. ఇంతకాలం కొన్ని కేసులు పెండింగ్ లో ఉండటంతో ఆగానని, క్రమశిక్షణ కమిటీకి అందిన ఫిర్యాదుల విచారణ పూర్తయ్యాకే  రాజీనామా సమర్పించానని ఆయన పేర్కొన్నారు. రాజీనామా వెనుక వేరే ఉద్దేశం ఏమీ లేదన్నారు.