గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనే దానిపై రాండమ్ సర్వే కు నిర్ణయం. విధి విధానాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి. సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను (September 1 To 15th) దాకా అన్ని జిల్లాల్లో సర్వే. జిల్లా అటవీ అధికారి నేతృత్వంలో కమిటీల ఏర్పాటు. ఒక అటవీ అధికారి, సంబంధిత శాఖ నుంచి ఒక అధికారి చొప్పున బృందాలు ఏర్పాటు. మొక్కలు నాటిన అన్ని ప్రాంతాల్లో సర్వే చేయనున్న బృందాలు.
గత రెండేళ్లలో (2019, 2020) నాటిన మొక్కలను పరిశీలించనున్న బృందాలు. బ్లాక్ ప్లాంటేషన్, లీనియర్ ప్లాంటేషన్, స్కాటర్డ్ ప్లాంటేషన్ లపై ఈ స్టడీ జరుగుతుంది. గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా అధ్యయనం చేయనున్న శాఖలు. రాండమ్ సర్వే ద్వారా ఒక్కో ప్రాంతంలో గత రెండేళ్లలో ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బతికాయి, కనీస ఎత్తు, చనిపోతే మార్చిన మొక్కల శాతంపై ప్రధానంగా ఈ అధ్యయనం జరగనుంది.ఈ శాఖలు గతంలో మొక్కలు నాటుతూ ఆయా ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి, TGFMIS వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేశాయి. ఈ నివేదిక ఆధారంగానే ఈ సర్వే జరుగుతుందని శాంతి కుమారి తెలిపారు. తెలంగాణకు హరితహారం ఫలితాలను సమీక్షించుకునేందుకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ అధ్యయనం ఉపయోగకరంగా ఉంటుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్నారు. ప్రభుత్వం చేసిన సూచనల మేరకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సరైన ఫలితాలను నివేదిక రూపంలో అందించాలని సమావేశంలో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసీసీఎఫ్) ఆర్. శోభ అధికారులను కోరారు.
ఈ సమావేశంలో పిసిసిఎఫ్ (సోషల్ ఫారెస్ట్) ఆర్.ఎం. డోబ్రియల్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ స్పెషల్ కమీషనర్ ప్రసాద్, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.