గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈనెల 28న వైజాగ్ లో మొక్కలు నాటనున్న ఎంపీ విజయ్ సాయి రెడ్డి

ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ్ సాయి రెడ్డి స్పందన

తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి ఈ నెల 28వ తేదీన వైజాగ్ లో మొక్కలు నాటుతానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యావరణ పరిరక్షణ కోసం, పచ్చదనం మరియు మంచి ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటుతారని ఆశిస్తున్నాను అన్నారు.