గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు. ఈ ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న రాజ్‌ చెంగప్ప ఇండియా గేట్ సమీపంలోని పండార పార్కులో జామ మొక్కను నాటి తన వంతుగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

శనివారం రాజ్ చెంగప్పను ఎంపీ సంతోష్ కుమార్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై చెంగప్ప హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని చెంగప్ప పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో దేశమంతటా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎంపీ అన్నారు.