ఏసీబీ వలలో పెద్దపెల్లి సీపీవో వెంకటనారాయణ

ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ రూ. 40 వేల లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తిరుపతి అనే గుత్తేదారుకు బిల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌ చేశాడు.

అయితే కాంట్రాక్టర్‌ తిరుపతి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో తిరుపతి నుంచి రూ.40వేల నగదు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. సీపీవోను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.