మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లోని వార్డులు, కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్‌లలో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారు. ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఏకంగా 44 మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించింది. రెండు కార్పొరేషన్లను సైతం టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. మెజార్టీ మున్సిపాలిటీల కైవసం దిశగా టీఆర్‌ఎస్‌ దూసుకెళ్లోంది. మహబూబాద్‌ జిల్లా మరిపెడ పురపాలికను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించారు. భీంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ దాదాపు ఏకపక్ష విజయంతో సత్తా చాటింది.