ఏసీబీ వలలో బాలానగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ నిజాముద్దిన్‌

తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. తమకు అందిన సమాచారంతో బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి సబ్‌ రిజిస్ట్రార్‌ నిజాముద్దిన్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ జియావుద్దీన్‌ చిక్కారు. విచారణ కొనసాగుతున్నది.