టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురికి టీటీడీ బోర్డు పాలక మండలిలో చోటు కల్పించింది. అందులో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కోరుట్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాసాగర్ రావు ఒకరు.

ప్రజా నాయకుడిగా రాణించడంతో పాటు ఆధ్యాత్మిక వేత్తగా గుర్తింపు పొందారు. కోరుట్ల నియోజకవర్గంలో పలు ఆలయాల నిర్మాణానికి సొంతంగా ఆర్థికంగా సహకారం అందించారు. అయ్యప్ప భక్తుడిగా ఇప్పటివరకు ముప్పై మూడు సార్లు దీక్ష స్వీకరించారు.

ప్రతి సంవత్సరం శబరిమలై తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన విద్యాసాగర్రావు టీటీడీ బోర్డు మెంబర్ గా నియమితులు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.