గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దాం: ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు

గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దామని ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను చలపతిరావు స్వీకరించి నేడు మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత భవనాల నిర్మాణంలో తెలంగాణ ఆరోస్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఛాలెంజ్‌ ద్వారా తెలంగాణను మొదటిస్థానంలో నిలబెడుదామన్నారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటితే ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఇళ్లలో పగలు సైతం విద్యుత్‌ వినియోగంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో హరిత భవనాల ప్రాధాన్యత పెరిగిందన్నారు. అనంతరం చలపతిరావు మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. సునీల్‌ కన్‌స్ట్రక్షన్‌, ట్రెడా మేనేజింగ్‌ పార్టనర్‌ సునీల్‌ చంద్రారెడ్డి, ట్రేడా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం. విజయ్‌సాయి, జీసీ మెంబర్‌ ఎం. శ్రీధర్‌రావు లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.