ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా నియమితులైన నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ను శనివారం ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌, తెలంగాణ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పాండు రాములు, ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు గోవర్ధన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.