హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో ఐటీ సోదాలు మూడవ రోజు కొనసాగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయం నుండి తెల్లవారుజామున మూడు గంటలకు ఐటీ బృందాలు వెళ్ళిపోయాయి. తిరిగి ఉదయం ఎనిమిది గంటలకు ప్రధాన కార్యాలయానికి వచ్చి సోదాలు చేపట్టారు. హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయాల్లో మూడవ రోజు సోదాలను ఐటీ టీమ్‌లు మొదలుపెట్టాయి. మరో వైపు హెటిరో డైరెక్టర్లు, సీఈఓల ఇళ్ళలో సోదాలు ముగిశాయి. సోదాల్లో భారీ నగదును ఐటీ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నగదుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. అంత భారీ నగదు ఉండటం వెనుక ఉన్న కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల్లో భాగంగా ఓ ఇంట్లో భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు ఎక్కడి నుండి తీసుకువచ్చారు…ఎవరికి సంబంధించిన నగదు.. కంపెనీ లావాదేవీలకు చెందినదా లేక ఏదైనా బ్యాంకు లావాదేవీలకు చెందినదా అన్న వివరాలు ఇన్‌కం ట్యాక్స్ అధికారులు తెలుసుకుంటున్నారు.