హరితహారం మొక్కలు నరికివేత: రూ. 50 వేల జరిమాన

కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్‌కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు తొలగించారు. దీంతో శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో వార్త రావడంతో కమిషనర్ నర్సయ్య వెంటనే స్పందించారు.

తొలగించిన మొక్కలపై ఎన్విరాల్‌మెంటల్ ఇంజినీర్ సురేశ్‌తో విచారణ చేపట్టారు. ప్రైవేటు దవాఖాన ప్రతినిధి రాంబాబును మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి మొదటి తప్పుగా భావించి రూ. 50 వేలు జరిమానా విధించినట్లు కమిషనర్ నర్స య్య తెలిపారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.