తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా పండుగ ఒక ప్రత్యేమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో, చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు. ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు.