మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు.
పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అందించినా ఆర్కేను కాపాడలేకపోయామని తెలిపారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. డయాలసిస్ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించారని తెలిపారు.